Online gaming: ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలకు రూ.లక్ష కోట్ల ట్యాక్స్‌ నోటీసులు

GST on online gaming companies: ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలకు జీఎస్టీ అధికారులు ₹1 లక్ష కోట్ల విలువైన ట్యాక్స్‌ నోటీసులు పంపినట్లు ఓ అధికారి తెలిపారు.

Published : 25 Oct 2023 13:15 IST

Online gaming companies | దిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్ కంపెనీలకు (Online gaming) బిగ్‌ షాక్‌. పన్ను ఎగవేతకు సంబంధించి దాదాపు రూ.1 లక్ష కోట్ల ట్యాక్స్‌ నోటీసులు జీఎస్టీ అధికారులు ఇప్పటి వరకు ఆయా సంస్థలకు పంపించారని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్‌ 1 తర్వాత కొత్తగా విదేశీ గేమింగ్‌ కంపెనీలు దేశంలో రిజిస్టర్‌ అయినట్లు డేటా ఏదీ లేదని సదరు అధికారి తెలిపారు.

ఆన్‌లైన్‌ గేమింగ్ కంపెనీలకు సంబంధించి జీఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. విదేశీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు అక్టోబర్‌ 1 నుంచి తప్పనిసరిగా దేశంలో రిజిస్టర్‌ అవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పెట్టే మొత్తం విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ విషయంలోనే గేమింగ్‌ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్‌ 1 నుంచే పెంచిన 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని గేమింగ్‌ కంపెనీలు పేర్కొంటుండగా.. చట్టం ఇది వరకే అమల్లో ఉందని ప్రభుత్వం చెప్తోంది.

ఏడంతస్తుల పొడవైన రాకెట్‌

ఈ క్రమంలోనే డ్రీమ్‌ 11, డెల్టా కార్పొరేషన్‌ వంటి ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలకు గత నెలలోనే షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో పాటు రూ.21వేల కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో గేమ్స్‌ క్రాఫ్ట్‌కు వేరేగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే, దీనిపై కర్ణాటక హైకోర్టును సదరు కంపెనీ ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జులైలో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని