Oppo Reno 10: ఒప్పో ట్రిపుల్‌ ధమాకా.. రెనో 10 సిరీస్‌లో ఒకేసారి 3 ఫోన్లు

Oppo Reno 10 Phones: ఒప్పో తన రెనో 10 సిరీస్‌లో ఒకేసారి మూడు ఫోన్లు భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. వీటితో పాటు ఎంకో సిరీస్‌లో కొత్త టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ బడ్స్‌ను సైతం కంపెనీ తీసుకొచ్చింది.

Published : 10 Jul 2023 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు లాంచ్‌ చేసింది. రెనో 10 సిరీస్‌లో మూడు ఫోన్లు తీసుకొచ్చింది. ఒప్పో రెనో 10 5జీ (Oppo Reno 10 5G), ఒప్పో రెనో 10 ప్రో 5జీ (Oppo Reno 10 pro 5G), ఒప్పో రెనో 10 ప్రో+ 5జీ (Oppo Reno 10 pro+ 5G) పేరిట వీటిని విడుదల చేసింది. వీటితో పాటు ఒప్పో ఎంకో ఎయిర్‌ 3 ప్రో పేరిట కొత్తగా వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను కూడా లాంచ్‌ చేసింది. వీటి ధర, ప్రొడక్ట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో రెనో 10 ప్రో+ 5జీ ఫోన్‌ ధరను రూ.54,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది 12జీబీ+256 జీబీ వేరియంట్‌లో వస్తోంది. రెనో 10 ప్రో 5జీ 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.39,999గా పేర్కొంది. గ్లాసీ పర్పుల్‌, సిల్వర్‌ గ్రే రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. ప్రో, ప్రో+ మోడళ్లు జులై 13 నుంచి అమ్మకానికి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా ఆన్‌లైన్‌ స్టో్ర్లతో పాటు ప్రధాన రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. ఒప్పో రెనో 10 5జీ ధరను జులై 20న వెల్లడించనున్నారు. ఇది ఐస్‌ బ్లూ, సిల్వర్‌ గ్రే రంగుల్లో లభించనుంది.

ఒప్పో రెనో 10 ప్రో+ 5జీ స్పెసిఫికేషన్లు

ఒప్పో రెనో 10 ప్రో+ 5జీ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 13.1తో వస్తోంది. 6.74 అంగుళాల అమోలెడ్‌ 3డీ కర్వడ్‌ డిస్‌ప్లే ఉంది. 120 డైనమిక్‌ రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్‌ వస్తోంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డివైజ్‌ స్టోరేజ్‌లో 8జీబీ వరకు ర్యామ్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో 64 ఎంపీ పెరీస్కోప్‌ సెన్సర్‌, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 890 ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన ప్రధాన కెమెరా, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం  32 ఎంపీ కెమెరా ఇచ్చారు. NFC, అండర్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉన్నాయి. 4700 ఎంఏహెచ్‌ బ్యాటరీతో కూడిన ఈ ఫోన్‌ 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీకి సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 27 నిమిషాల్లోనే 0-100 శాతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఒప్పో రెనో 10 ప్రో 5జీ ఫీచర్లు

ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ 3డీ కర్వడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120 రిఫ్రెష్‌ రేటు ఉంది. 8జీబీ వరకు వర్చువల్‌ ర్యామ్‌ వినియోగించుకోవచ్చు. ఇందులో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 890 ప్రధాన కెమెరా ఇచ్చారు. 32 ఎంపీ టెలీఫొటో సెన్సర్‌ ఇచ్చారు. ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఉంది. ఇందులో 4600 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 80W సూపర్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఒప్పో రెనో 10 5జీ స్పెక్స్‌

ఇందులో ఒప్పో రెనో 10 ప్రోలో ఉన్న సాఫ్ట్‌వేర్‌, డిస్‌ప్లే స్పెసిఫికేషన్సే ఇందులోనూ ఉన్నాయి.  మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌ను వినియోగించారు. 64 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. 32 ఎంపీ టెలీఫొటో లెన్స్‌, 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అమర్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 0-100 శాతం ఛార్జింగ్‌కు 47 నిమిషాల పడుతుందని కంపెనీ చెబుతోంది.

ఒప్పో ఎంకో ఎయిర్‌ 3

ఒప్పో రెనో 10 సిరీస్‌ ఫోన్లతో పాటు ఎంకో సిరీస్‌లో ఎంకో ఎయిర్‌ 3 ప్రో ఇయర్‌బడ్స్‌ను ఒప్పో లాంచ్‌ చేసింది. దీని ధరను కంపెనీ రూ.4,999గా నిర్ణయించింది. జులై 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు రిటైల్‌ స్టోర్లలో ఈ ఇయర్‌బడ్స్‌ లభ్యం కానున్నాయి. ఇందులో 12.4 ఎంఎం డ్రైవర్లు ఇచ్చారు. యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సదుపాయం ఉంది. ఇబయర్‌ బడ్స్‌లో 43ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ కేస్‌లో 440 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. ఛార్జింగ్‌ కేస్‌తో కలిపి ఈ ఇయర్‌బడ్స్‌ 30 గంటల ప్లే బ్యాక్‌ టైమ్‌ వస్తాయని కంపెనీ పేర్కొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని