Park Hotels IPO: ఫిబ్రవరి 7న పార్క్‌ హోటల్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి ఖరారు

Park Hotels IPO: రూ.920 కోట్ల సమీకరణ లక్ష్యంతో పార్క్‌ హోటల్స్‌ ఐపీఓకి వస్తోంది. పూర్తి వివరాలు ఇవే..

Published : 31 Jan 2024 15:08 IST

దిల్లీ: ‘ది పార్క్‌’ బ్రాండ్‌పై హోటళ్లు నిర్వహిస్తున్న ఏపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్‌ (Park Hotels) లిమిటెడ్‌ ఐపీఓ (IPO) ఫిబ్రవరి 5న ప్రారంభమై 7 వరకు కొనసాగనుంది.  షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.147- 155గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.920 కోట్లు సమీకరించనుంది. అందులో తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.600 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో షేర్లను విక్రయించడం ద్వారా రూ.320 కోట్లు సేకరించనుంది. కనీసం 96 (ఒక లాట్‌) షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐపీఓలో పాల్గొనాలనుకునేవారు గరిష్ఠ ధర కనీసం రూ.14,880 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఐపీఓలో 75 శాతం పైగా షేర్లను అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs) కేటాయించారు. 15 శాతం (high net-worth individuals) అత్యంత సంపన్నులకు, 10 శాతం రిటైల్‌ మదుపరులకు రిజర్వ్‌ చేశారు. 1987లో స్థాపించిన ఏపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ ‘ది పార్క్‌’ బ్రాండ్‌పై వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఫ్లూరిస్‌ (Flurys) బ్రాండ్‌ పేరుతో రిటైల్ ఫుడ్‌, పానీయాలను విక్రయిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని