RIL Results: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభం 11 శాతం క్షీణత

Reliance Q1 Results: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభం 11 శాతం మేర క్షీణించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.16,011 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 21 Jul 2023 21:14 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాలను (Reliance Q1 Results) ప్రకటించింది. ఓ2సీ బిజినెస్‌ వ్యాపారంలో మందగమనం కారణంగా నికర లాభం క్షీణించింది. గతేడాది ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ.17,955 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఆ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,011 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంటే లాభం 11 శాతం మేర క్షీణించింది. అంతకుముందు మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.19,299 కోట్లుగా నమోదైంది.

Reliance Jio: జియో లాభం ₹4,863 కోట్లు.. టారిఫ్‌ విషయంలో క్లీన్‌చిట్‌

కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం రూ.2.22 లక్షల కోట్ల నుంచి రూ.2.1లక్షల కోట్లకు తగ్గింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది రూ.2.16 లక్షల కోట్లుగా ఉంది. క్రూడాయిల్‌ ధరలు తక్కువగా ఉండడం, చమురు మార్జిన్లు తగ్గడం ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం. అలాగే ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ ఇచ్చేందుకు బోర్డు సిఫార్సు చేసింది. దీనికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం 2.48% నష్టంతో రూ.2,555.00 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని