Reliance Jio: జియో లాభం ₹4,863 కోట్లు.. టారిఫ్‌ విషయంలో క్లీన్‌చిట్‌

జియో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.4,863 కోట్లు ఆర్జించింది. మరోవైపు టారిఫ్‌ విషయంలో ట్రాయ్‌ నుంచి క్లీన్‌చిట్ లభించింది.

Published : 21 Jul 2023 19:31 IST

దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం సంస్థ జియో (Reliance Jio) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 12 శాతం వృద్ధితో రూ.4863 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.4,335 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 9.9 శాతం మేర పెరిగి రూ. 21,873 నుంచి రూ.24,042 కోట్లకు చేరింది.

జియోకు క్లీన్‌చిట్‌

టారిఫ్‌ విషయంలో జియోకు ట్రాయ్‌ నుంచి క్లీన్‌ చిట్‌ లభించింది. జియో బ్రాండ్‌బ్యాండ్‌ ద్వారా టీవీ ఛానెల్స్‌ను అందించడం ద్వారా మోసపూరిత ధరల విధానాన్ని అవలంబిస్తోందంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన ట్రాయ్‌.. ఎలాంటి నిబంధనలనూ జియో ఉల్లంఘించలేదని స్పష్టంచేసింది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

చైనాకు చెక్‌పెట్టేందుకు భారత్‌ ‘పవర్‌’..!

జియో బ్రాడ్‌బ్యాండ్‌ తన యాప్స్‌ ద్వారా లైవ్‌ టీవీ ఛానెల్స్‌ను అందించడంపై ట్రాయ్‌కు ఫిర్యాదులు అందాయి. ‘‘రూ.198కి బ్రాడ్‌బ్యాండ్ (అపరిమిత డేటా, వాయిస్) అందించడం పక్కనపెడితే.. 400 ఛానెళ్లను రూ.100 (రూ.298 ప్లాన్), 550 ఛానెళ్లను రూ.200 (398 ప్లాన్)కు అందించడం అనేది ఏ డీటీహెచ్‌ ఆపరేటర్‌కూ సాధ్యం కాదు. ఇలాంటి టారిఫ్‌ విధానం డీటీహెచ్‌ వ్యాపారాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ఇది టెలికాం టారిఫ్‌ ఆర్డర్‌కు పూర్తి వ్యతిరేకం’’ అని ట్రాయ్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై జియో వివరణ తీసుకున్న ట్రాయ్‌.. అనంతరం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని