Tata play Binge: ₹349కే 26 ఓటీటీ యాప్స్‌.. టాటా బింజ్‌ ప్లాన్స్‌ ఇవే..

Tata play Binge Subscription Plans: ఓటీటీ యాప్స్‌ను ఒకే చోట అందిస్తోంది టాటా ప్లే బింజ్‌. ఇందులో ప్లాన్స్‌ నెలకు రూ.199 నుంచి ప్రారంభవుతాయి. పూర్తి వివరాలు ఇవిగో..

Published : 01 May 2023 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పుణ్యమా అని ఓటీటీలకు (OTT) ఆదరణ పెరిగింది. వేర్వేరు ఓటీటీ వేదికలు అందించే కంటెంట్‌ను చూడాలంటే మాత్రం వాటికి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సిందే. అలాంటి ఓటీటీ యాప్స్‌ అన్నింటినీ ఒకే చోట అందిస్తోంది టాటా ప్లే బింజ్‌ (Tata play Binge). దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో అందుబాటులో ఉన్న 26 ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఒకే వేదికగా తీసుకొచ్చింది. సింగిల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా ఆయా ఓటీటీ యాప్స్‌లో లభించే సినిమాలు, టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లు, ఇతర స్పోర్ట్స్‌ ఈవెంట్లను ఒకేచోట చూసే వీలు కల్పిస్తోంది. నెలవారీ ప్లాన్లు రూ.199 నుంచే మొదలవుతున్నాయి.

టాటా ప్లే డీటీహెచ్‌ సేవలు వినియోగించే వారితో పాటు వినియోగించని వారు సైతం బింజ్‌ ఓటీటీ సేవలను పొందొచ్చు. ఇందుకోసం టాటా ప్లే బింజ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు పరిమిత సంఖ్యలో ఓటీటీ యాప్స్‌ను అందించే టాటా ప్లే బింజ్‌.. ఇప్పుడు ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆహాను సైతం ఈ జాబితాలో చేర్చింది. టీవీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఎక్కడైనా వీటిని వీక్షించే వీలుంది. అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీ, టాటా ప్లే బింజ్‌ సెటప్‌ బాక్స్‌ ద్వారా టీవీల్లో వీక్షించొచ్చు.

26 యాప్స్‌ కలిగిన నెలవారీ ప్లాన్స్‌ రూ.349గా టాటా ప్లే బింజ్‌ నిర్ణయించింది. 24 యాప్స్‌తో వస్తున్న మరో ప్లాన్‌ ధరను రూ.249 గానూ, 20 ఓటీటీ యాప్స్‌ కావాలనుకునే వారు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీ లివ్‌, జీ5, సన్‌ నెక్ట్స్‌, ఆహా, ఎరోస్‌ నౌ, ఎంఎక్స్‌ ప్లేయర్‌, హంగామా, వూట్‌ వంటి యాప్స్‌ ఉన్నాయి. ఇవి నెలవారీ ప్లాన్లతో పాటు, త్రైమాసిక, వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్నాయి. రూ.349 ప్లాన్‌ను.. మూడు నెలలకు తీసుకుంటే రూ.989; ఏడాదికి తీసుకుంటే రూ.3839 అవుతుంది. అయితే, అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌ మాత్రం అందుబాటులో లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు