UPI: అక్టోబరులో 730 కోట్ల యూపీఐ లావాదేవీలు.. విలువ ₹12 లక్షల కోట్లు

UPI: యూపీఐ లావాదేవీల సంఖ్య అక్టోబరులో రికార్డు స్థాయికి చేరింది. పరిమాణం పరంగా 73 శాతం, విలువలో 57 శాతం పెరిగాయి

Published : 01 Nov 2022 15:30 IST

ముంబయి: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలు అక్టోబరులో రికార్డు స్థాయిలో 730 కోట్లకు చేరాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషేన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) వెల్లడించింది. ఈ లావాదేవీల విలువ రూ.12.11 లక్షల కోట్లని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్యలో 73 శాతం, విలువ 57 శాతం పెరిగాయి. 2021 అక్టోబరులో లావాదేవీల సంఖ్య 325 కోట్లే కావడం గమనార్హం. పండగ సీజన్‌ నేపథ్యంలోనే లావాదేవీల సంఖ్య, విలువ గణనీయంగా పెరిగాయి. గత రెండేళ్లుగా యూపీఐ లావాదేవీలు విస్తరిస్తూ వస్తున్నాయి. కొవిడ్‌ కారణంగా మధ్యలో కొన్ని నెలలు మినహాయిస్తే ప్రతినెలా వృద్ధి నమోదవుతూనే ఉంది. ఈ ఏడాది మేలో తొలిసారిగా యూపీఐ లావాదేవీల విలువ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని