Voltas: వోల్టాస్‌ గృహోపకరణాల వ్యాపార విక్రయం.. టాటా గ్రూప్‌ క్లారిటీ

Tata group - Voltas: వోల్టాస్‌ పేరిట ఉన్న గృహోపకరణాల వ్యాపారం నుంచి టాటా గ్రూప్‌ నిష్క్రమించాలని భావిస్తోంంటూ వార్తలు వచ్చాయి. దీన్ని కంపెనీ ఖండించింది.

Updated : 07 Nov 2023 19:20 IST

Tata group | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉప్పు నుంచి విమానాల వరకు వివిధ వ్యాపారాల్లో ఉన్న టాటా గ్రూప్‌ (Tata group).. గృహోపకరణాల వ్యాపారమైన వోల్టాస్‌కు గుడ్‌బై చెప్పనుందంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ ఖండించింది. తమ వ్యాపారాన్ని (Voltas) విక్రయించే ఉద్దేశమేదీ లేదని పేర్కొంది. వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వోల్టాస్‌ బ్రాండ్‌తో గృహోపకరాణాలు విక్రయించే టాటా గ్రూప్‌.. ఆ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని చూస్తోందంటూ కొన్ని ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇంకా అవి చర్చల దశలోనే ఉన్నాయన్నది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో వోల్టాస్‌ స్పందించింది. అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేసింది.

విల్మర్‌ సంయుక్త సంస్థ నుంచి అదానీ బయటకు?

ఎయిర్‌ కండీషనర్లు, వాటర్‌ కూలర్లు, కమర్షియల్‌ రిఫ్రిజిరేటర్లు తయారుచేసే వోల్టాస్‌ సంస్థ 1954లో ఏర్పాటైంది. భారత్‌ సహా పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. వోల్టాస్‌కు అర్సెలిక్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ను కూడా ఏర్పాటు చేసింది. వోల్టాస్‌బెకో (Voltas Beko) పేరిట దేశీయ మార్కెట్లో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, డిష్‌వాషర్లు, మైక్రోఒవెన్స్‌ను విక్రయిస్తున్నారు. దేశీయ రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో ఈ కంపెనీకి 3.4 శాతం, వాషింగ్‌ మెషిన్ల మార్కెట్లో 5.4 శాతం వాటా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని