logo

నూలు లేదు.. ఇంటింటా ‘టెరీకాటన్‌’ జెండాలే!

నూలు వస్త్రానికి జాతీయ జెండాకు విడదీయలేని అనుబంధం. స్వాతంత్య్ర పోరాటంలో ఖద్దరు ధరించడమనేది భారతజాతి నిర్ణయించుకున్న నియమం.

Published : 15 Aug 2022 05:11 IST


అధికారులు పంపిణీ చేసిన టెరికాటన్‌ జండాతో వెంకట్‌ అనే కార్మికుడు

ఈటీవీ- ఆదిలాబాద్‌: నూలు వస్త్రానికి జాతీయ జెండాకు విడదీయలేని అనుబంధం. స్వాతంత్య్ర పోరాటంలో ఖద్దరు ధరించడమనేది భారతజాతి నిర్ణయించుకున్న నియమం. అయితే వజ్రోత్సవాల వేళ ఇంటింటా తిరంగ అనే నినాదంతో టెరీకాటన్‌తో చేసిన జెండాలను పంపిణీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకప్పుడు బ్రిటీష్‌ పాలకుల వస్త్రంగా పేర్కొనే టెరీకాటన్‌ను బహిష్కరించాలని పిలుపునిస్తే.. ఇప్పుడు అదే వస్త్రంతో చేసిన పతాకాలను పంపిణీ చేయడం ఏమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రతి ఇంటికో జెండా చొప్పున ప్రభుత్వం మూడు విడతల్లో 2.33 లక్షలను గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేసింది. ఇవన్నీ టెరీకాటన్‌తో చేసినవి కావడమే గమనార్హం. దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో నూలు, చేనేత ఖ్యాతిని గుర్తించాల్సిందిపోయి టెరీకాటన్‌కు ప్రాధాన్యమివ్వడమేంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌ను ‘ఈనాడు’ సంప్రదించగా.. సిరిసిల్లా నుంచి పంపిణీ చేశామన్నారే కానీ వస్త్రం గురించి తమకు చెప్పలేదని పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని