logo

28న ఆదివాసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

ఆదివాసీ గిరిజనుల సమస్యలను చర్చించి, పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటంపై ఈనెల 28న సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.

Published : 26 Apr 2024 18:15 IST

ఎదులాపురం: ఆదివాసీ గిరిజనుల సమస్యలను చర్చించి, పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటంపై ఈనెల 28న సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.  కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల అవలంబిస్తున్న విధానం, తదితర అంశాలపై సమావేశం నిర్వహించనున్నట్టు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉయిక విష్ణు పూసం సచిన్ తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వ గిరిజన విధానాలు- ఆదివాసులపై ప్రభావం’ అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నామన్నారు. జిల్లాలోని ఆదివాసీ సంఘాలు, పటేళ్లు, రాయి సెంటర్ల సార్ మేడిలు, ఆదివాసీ యువజన సంఘాల నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని