logo

రైతుబజార్లలో టమాటా అమ్మకాలు

రైతుబజార్లలోనూ టమాటా అమ్మకాలు జరిగేలా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. హోల్‌సేల్‌ మార్కెట్ల నుంచి నేరుగా సరకును అక్కడికి తరలించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ నుంచి మాత్రమే

Published : 29 May 2022 02:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబజార్లలోనూ టమాటా అమ్మకాలు జరిగేలా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. హోల్‌సేల్‌ మార్కెట్ల నుంచి నేరుగా సరకును అక్కడికి తరలించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ నుంచి మాత్రమే టమాటా వస్తోంది. రాజస్థాన్‌, మహారాష్ట్ర నుంచి వచ్చే పంటను రిటైల్‌ వ్యాపారులు దక్కించుకుంటున్నారు. కమీషన్‌ ఏజెంట్లతో ముందు రోజే మాట్లాడుకుంటున్నారు. దీంతో రైతుబజార్లకు టమాటా వెళ్లడంలేదు.  హోల్‌సేల్‌లో టమాటాను కిలో రూ.40-రూ.50కు కొంటున్న రిటైల్‌ వ్యాపారులు రూ.80-100కి అమ్ముతున్నారు. రైతుబజారులో రూ.52 చొప్పున అమ్మాలని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. 

రాజస్థాన్‌ నుంచి సరకు.. ప్రస్తుత ఎండలకు తెలంగాణలో టమాటా పంట ఎండిపోయింది. కేవలం అంకాపూర్‌ నుంచి మాత్రమే వస్తోంది. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి వచ్చే టమాటా 25 కిలోల బాక్సు రూ.1200 ఉండగా.. అంకాపూర్‌ నుంచి వచ్చే టమాటా బాక్సు రూ.1300 పలుకుతోంది. దీంతో రైతుబజారులోనే కిలో టమాటా రూ. 52 అయిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని