logo

హైదరాబాద్‌ ఆటోనగర్‌ వద్ద కెమికల్‌ ట్యాంకర్‌లో మంటలు

కెమికల్‌ ట్యాంకర్‌ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం దగ్ధమైన ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం

Updated : 04 Jul 2022 11:09 IST

వనస్థలిపురం: కెమికల్‌ ట్యాంకర్‌ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం దగ్ధమైన ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పరిశ్రమకు రసాయనాలు సరఫరా చేసే ట్యాంకర్‌ లారీ ఇంజిన్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో హయత్‌నగర్‌ సమీపంలోని పెద్ద అంబర్‌పేట నుంచి ఆటోనగర్‌కు డ్రైవర్‌ ట్యాంకర్‌ లారీను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై ఆటోనగర్‌ సమీపంలోని హరిణ వనస్థలి జాతీయ వనం వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా లారీలోంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్‌ లారీని రోడ్డు పక్కన ఆపి పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని