logo

నిత్యావసరాలపై జీఎస్టీ రద్దు చేయాలి

నిత్యావసరాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ డిమాండ్‌ చేశారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నూనెల ధరలు పెరిగాయన్నారు. పాలు, పెరుగు తదితర వాటిపై

Published : 10 Aug 2022 02:45 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: నిత్యావసరాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ డిమాండ్‌ చేశారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నూనెల ధరలు పెరిగాయన్నారు. పాలు, పెరుగు తదితర వాటిపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం దుర్మార్గమన్నారు. అందుకు నిరసనగా మంగళవారం అంబర్‌పేటలో గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాలను ప్రదర్శిస్తూ నరేంద్ర మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం హయాంలో వంట గ్యాస్‌ ధర తగ్గించాలని ఆందోళన చేపట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తుత ధర రూ. 1105 పై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేతలు ఖలీద్, సాయిబాబా, ఉదయ్‌భాస్కర్, చక్రధర్, ప్రణీత్, సోహైల్, మధు, పవన్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని