logo

సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీపై మరో కేసు

సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ లక్ష్మీనారాయణపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే సీసీఎస్‌లో ఒక కేసు, జూబ్లీహిల్స్‌ ఠాణాలో గత నెల 31న ఒక కేసు నమోదయ్యాయి.

Published : 11 Aug 2022 03:07 IST

జూబ్లీహిల్స్‌: సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ లక్ష్మీనారాయణపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే సీసీఎస్‌లో ఒక కేసు, జూబ్లీహిల్స్‌ ఠాణాలో గత నెల 31న ఒక కేసు నమోదయ్యాయి. తాజాగా జూబ్లీహిల్స్‌ ఠాణాలో మరో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి గోకుల్‌ ప్లాట్స్‌లో నివసించే టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేసే కేఎస్‌ఎన్‌వీఎస్‌ మణికంఠ బాబు 2018లో సాహితి సంస్థ గుట్టల బేగంపేట ప్రాంతంలో నిర్మించే సాహితి కార్తికేయ పనోరమ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు కోసం సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను కలిశారు. ఆయన మాటలు నమ్మి టవర్‌-1లో ఓ ఫ్లాట్‌ కొనుగోలు కోసం రూ.కోటి 2లక్షల 10వేలకుగాను రూ.25 లక్షలు ముందస్తుగా చెల్లించారు. అనంతరం ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ డీడ్‌ను సంస్థ డైరక్టర్‌ పూర్ణచందర్‌రావు పూర్తి చేశారు. కొద్దిరోజుల తర్వాత లక్ష్మీనారాయణ, పూర్ణచందర్‌రావుతోపాటు మరో డైరక్టర్‌ అయిన లక్ష్మీనారాయణ సతీమణి పార్వతి.. తనకు విక్రయించిన ఫ్లాట్‌ను బింజు సరియా స్పాంజ్‌ అండ్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. దీంతో గత నెల 25న సాహితి సంస్థ కార్యాలయానికి వెళ్లగా లక్ష్మీనారాయణతోపాటు సీఎఫ్‌ఓ రాం ఎస్‌ఆర్‌పీ, జంపన మహేష్‌ వర్మ తదితరులు ఆయనను బెదిరించారు. ఈ మేరకు మణికంఠ బాబు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణ, పార్వతి, సాత్విక్‌(లక్ష్మీనారాయణ కుమారుడు), పూర్ణచందర్‌రావు, రామ్‌ ఎస్‌ఆర్‌పీ, జంపన మహేష్‌వర్మ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై సీసీఎస్‌లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ కేసును సీసీఎస్‌ ఏసీపీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పరిశీలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని