logo

మెట్రో ప్రయాణికుల వారధి స్విధ

నలుగురు స్నేహితులు సిద్ధార్థ్‌, జిజ్ఞేష్‌, గౌతమ్‌, అనూజ్‌.. వేర్వేరు వృత్తి, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. పలు దేశాలు తిరిగిన అనుభవం వీరి సొంతం. ఆయా దేశాల్లో మెట్రో వంటి ప్రజారవాణాకు అనుసంధానంగా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ సదుపాయం ఉండటంతో అందరూ ప్రజారవాణాకే మొగ్గుచూపడం గమనించారు.

Published : 04 Oct 2022 03:04 IST

స్టేషన్ల నుంచి 6 కి.మీ. లోపు షటిల్‌ సర్వీసులు

కొవిడ్‌ కష్టాలను అధిగమించి పది లక్షల రైడ్స్‌

ఈనాడు, హైదరాబాద్‌

షటిల్‌ సర్వీసు సిబ్బందితో స్విధ మొబిలిటీ డైరెక్టర్‌ జిజ్ఞేష్‌,

సీఈవో సిద్ధార్థ్‌, గౌతమ్‌, అనూజ్‌

నలుగురు స్నేహితులు సిద్ధార్థ్‌, జిజ్ఞేష్‌, గౌతమ్‌, అనూజ్‌.. వేర్వేరు వృత్తి, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. పలు దేశాలు తిరిగిన అనుభవం వీరి సొంతం. ఆయా దేశాల్లో మెట్రో వంటి ప్రజారవాణాకు అనుసంధానంగా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ సదుపాయం ఉండటంతో అందరూ ప్రజారవాణాకే మొగ్గుచూపడం గమనించారు. మన దగ్గర అలాంటి సదుపాయం లేకపోవడం లోటుగా గుర్తించారు. నలుగురు కలిసి కాఫీ షాపులో పిచ్చాపాటిలో దీని గురించి చర్చకొచ్చింది. తామే ఎందుకు ప్రారంభించకూడదు అనే ఆలోచనతో మొదలైందే మెట్రో షటిల్‌ సర్వీస్‌ ‘స్విధ’ మొబిలిటీ. మూడేళ్ల క్రితం మొదలైన వీరి సేవలు.. కొవిడ్‌ కష్టాలను అధిగమించి ఇటీవల 10 లక్షల మంది మెట్రో ప్రయాణికులను గమ్యస్థానం చేర్చిన మైలురాయిని చేరుకుంది. మెట్రో స్టేషన్ల నుంచి చుట్టుపక్కల 4-6 కి.మీ. మధ్యలో వీటిని నడుపుతోంది స్విధ. వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్‌ మెట్రో వరకు, మెట్టుగూడ నుంచి ఈసీఐఎల్‌ వరకు.. ఇలా చాలామార్గాల్లో ఫీడర్‌ సర్వీసులను నడుపుతోంది. వాహనాలను ఇంటివద్దనే వదిలి షటిల్‌ సర్వీస్‌లో మెట్రో స్టేషన్‌కు వచ్చి అక్కడి నుంచి మెట్రోలో గమ్యస్థానం చేరుతున్నారు. ఐటీ కారిడార్‌లో 22-28 మంది వరకు తీసుకెళ్లే బస్సులను ఉపయోగిస్తుంటే.. 4 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలకు 12 మంది కూర్చునే వింజర్లను ఉపయోగిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, మాల్స్‌, విద్యాసంస్థలు, హైకోర్టు, సచివాలయం ఇలా ప్రతిచోటకు నడుపుతున్నారు.

నిలిపేందుకు జాగా చూపిస్తే.. - సిద్ధార్థ్‌, సీఈవో, స్విధ మొబిలిటీ

‘‘హైదరాబాద్‌లోని ప్రధాన మెట్రో స్టేషన్ల అన్నింటి నుంచి మెట్రో షటిల్‌ సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. స్టేషన్ల వద్ద వాహనాలు ఆపేందుకు స్థలం లేక ఇబ్బంది పడుతున్నాం. స్టేషన్‌ సమీపంలో బస్టాపుల మాదిరి నిర్దిష్టమైన చోట షటిల్‌ సర్వీసుల కోసం జాగా కేటాయిస్తే ప్రయాణికులకు తెలుస్తుంది. ఎక్కువ మంది సద్వినియోగం చేసుకుంటారు. ఆ మేరకు సర్వీసులు నడిపే సామర్థ్యం మాకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని