logo

డా.శుభాకర్‌కు ఎఫ్‌ఆర్‌సీపీ ఫెలోషిప్‌ ప్రదానం

ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి మాజీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డా. కె.శుభాకర్‌ లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ నుంచి అరుదైన ఎఫ్‌ఆర్‌సీపీ(రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్‌) ఫెలోషిప్‌ అందుకున్నారు.

Published : 09 Dec 2022 04:43 IST

డా.శుభాకర్‌ను అభినందిస్తున్న సారా క్లార్క్‌  

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి మాజీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డా. కె.శుభాకర్‌ లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ నుంచి అరుదైన ఎఫ్‌ఆర్‌సీపీ(రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్‌) ఫెలోషిప్‌ అందుకున్నారు. లండన్‌లో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రాయల్‌ కాలేజ్‌ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అధ్యక్షులు డా.సారా క్లార్క్‌ శుభాకర్‌కు పురస్కారాన్ని ప్రదానం చేశారు. శ్వాసకోశ వ్యాధుల నిపుణులైన డా.శుభాకర్‌ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా, జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమ జోనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా, స్వైన్‌ఫ్లూ మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ సమన్వయకర్తగా పనిచేశారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ చెస్ట్‌ ఫిజీషియన్స్‌ సంస్థ తరఫున ఛాతీ వైద్యుల అంతర్జాతీయ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరించి ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. దేశంలో ఛాతీ సంబంధిత, శ్వాసకోశ సంబంధిత జబ్బులపై పరిశోధనలను ప్రోత్సాహించడంతోపాటు వైద్య నిపుణులకు అవగాహన కలిగించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని