logo

రెక్కీ.. కళ్లల్లో కారం.. ఆపై దోపిడీ!

కాలాపత్తర్‌కు చెందిన కరడుగట్టిన గొలుసు దొంగ. నేరస్థులతో ముఠాకట్టి చోరీలు, దోపిడీలతో నగరంలో భయానక వాతావరణం సృష్టించాడు.

Published : 10 Dec 2022 03:22 IST

దోపిడీ ముఠా వెనుక చైన్‌స్నాచర్‌

ఈనాడు, హైదరాబాద్‌- రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: కాలాపత్తర్‌కు చెందిన కరడుగట్టిన గొలుసు దొంగ. నేరస్థులతో ముఠాకట్టి చోరీలు, దోపిడీలతో నగరంలో భయానక వాతావరణం సృష్టించాడు. ఇతడిపై 250కుపైగా చైన్‌స్నాచింగ్‌ కేసులున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అంతర్రాష్ట్ర దొంగలతో కలిసి మరోసారి నగరంపై పంజా విసిరాడు.

* నవంబరు 22న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో కృష్ణ జువెలర్స్‌ సేల్స్‌మెన్‌ ఆనంద్‌, 24న హిమాయత్‌నగర్‌ రోడ్‌ నం.6లోని డిగ్నిటీ జువెలర్స్‌లో పనిచేసే జితేందర్‌శర్మ, ఈనెల 5న సికింద్రాబాద్‌ ఆర్పీరోడ్‌లో నగల దుకాణాల్లో పనిచేసే పవన్‌కుమార్‌లను లక్ష్యంగా చేసుకుని కళ్లల్లో కారం కొట్టి దాడిచేసి రూ.50-60లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

నగల దుకాణాలే లక్ష్యం.. కరడుగట్టిన చైన్‌స్నాచర్‌ జైలు నుంచి బయటకురాగానే.. అంతర్రాష్ట్ర నేరస్థులతో ముఠా ఏర్పాటుచేశాడు. ప్రముఖ నగల దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారు. నగల సరఫరా ఉద్యోగులు, కొరియర్‌బాయ్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇద్దరు కళ్లల్లో కారం కొట్టి దాడి చేస్తుండగానే.. మరో ఇద్దరు నగలు తీసుకుని పారిపోయేవారు.

* రాంగోపాల్‌పేట, సికింద్రాబాద్‌ల్లో రెండుసార్లు దోపిడీకి యత్నించి విఫలమయ్యారు. మహంకాళి ఠాణా పరిధిలో పవన్‌కుమార్‌ను కత్తితో గాయపరిచి నగలతో పారిపోతున్న సీసీఫుటేజ్‌ ఆధారంగా దొంగలు పాతబస్తీ వైపువెళ్లినట్టు గుర్తించి ఆరా తీస్తే.. ముఠా బాగోతం వెలుగుచూసింది. నిందితులను పట్టుకొనేందుకు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. తాజాగా నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు పరారీలోఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని