logo

టీ హబ్‌ను సందర్శించిన ఎన్‌ఆర్‌ఐల బృందం

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని టీహబ్‌, టీవర్క్స్‌ను తెలంగాణ ప్రవాస భారతీయుల బృందం శనివారం సందర్శించింది.

Published : 09 Apr 2023 03:01 IST

టీవర్క్స్‌ పనితీరును ఎన్‌ఆర్‌ఐల బృందానికి వివరిస్తున్న సంస్థ ప్రతినిధి

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని టీహబ్‌, టీవర్క్స్‌ను తెలంగాణ ప్రవాస భారతీయుల బృందం శనివారం సందర్శించింది. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం ఆధ్వర్యంలో తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ నాయకులు, ప్రతినిధులు సందర్శించారు. టీహబ్‌, టీవర్క్స్‌లో సరికొత్త ఆలోచనలతో వచ్చే యువతను అంకుర సంస్థల ఏర్పాటులో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరును వాటి ప్రతినిధులు బృందానికి వివరించారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ పిల్లలకు టీహబ్‌, టీవర్క్స్‌ను చూపించి బాల్యం నుంచే కొత్త ఆవిష్కరణలతో అంకురాలు స్థాపించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఐ, భారాస యూకే అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ దూసరి మాట్లాడుతూ.. విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే యువతను ప్రోత్సహించేందుకు టీహబ్‌, టీవర్క్స్‌ను ఏర్పాటుచేయడం ప్రశంసనీయమన్నారు. అంకుర సంస్థలు సాఫీగా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుకూల వాతావరణం టీహబ్‌లో ఉందన్నారు. ప్రపంచ ఖ్యాతి పొందిన సంస్థలు తమ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రంగా చేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో మారుతినేనిగూడెం సర్పంచ్‌ రాము బండమీది, అరవింద్‌ రెడ్డి, హరిగౌడ్‌ నవపేట్‌, సుప్రజ పులుసు, జాహ్నవి దూసరి, రవి ప్రదీప్‌ పులుసు, జెల్లా శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని