logo

శతాబ్ది దిశగా తెలంగాణ రన్‌

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ, రాచకొండ పోలీసులు మేడిపల్లి ఏవీ ఇన్‌ప్రో ప్రైడ్‌ మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ రన్‌’ సందర్భంగా ‘డీజే టిల్లు’ పాటకు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు.

Published : 13 Jun 2023 02:01 IST

పీర్జాదిగూడ (బోడుప్పల్‌), న్యూస్‌టుడే

శాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ, రాచకొండ పోలీసులు మేడిపల్లి ఏవీ ఇన్‌ప్రో ప్రైడ్‌ మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ రన్‌’ సందర్భంగా ‘డీజే టిల్లు’ పాటకు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. రాచకొండ సీపీ చౌహాన్‌ జత కలిశారు. ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌, డీసీపీ, ఏసీపీ, పీర్జాదిగూడ, బోడుప్పల్‌ మేయర్లు పాల్గొన్నారు.


ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. 2కె రన్‌

వికారాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వికారాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో 2కె రన్‌ను ఎమ్మెల్యే ఆనంద్‌ జెండా ఊపి ప్రారంభించారు. యువత, ఉద్యోగులు, వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలంపల్లి దర్గా వరకు కొనసాగింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వచ్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాల అదుపు: ఎమ్మెల్యే

పరిగి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాలు అదుపులోకి వచ్చాయని ఎమ్మెల్యే కె.మహేష్‌రెడ్డి అన్నారు. సోమవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో 2కె రన్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో సీఐ వెంకట్రామయ్య, డీపీఓ తరుణ్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌ తదితరులున్నారు.

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: తాండూరులో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌ రోడ్డు, కూడళ్ల మీదుగా విలియం మూన్‌ ఉన్నత పాఠశాల మైదానం దాకా కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

కొడంగల్‌, న్యూస్‌టుడే:  2కె రన్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు మున్సిపల్‌ పరిధిలోని అంబేడ్కర్‌ కూడలి నుంచి పట్టణ శివారులో గల డిగ్రీ కళాశాల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీఆర్‌డీఏ పీˆడీ కృష్ణణ్‌, ఎస్సై రవిలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని