logo

Hyderabad: కారు టైరు పేలి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం

కారు టైరు పేలి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం చెందారు.ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలను ఎస్సై శ్రీనివాసరావు వివరించారు.

Updated : 28 Oct 2023 13:45 IST

ఆదిభట్ల, న్యూస్‌టుడే: కారు టైరు పేలి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software Employee) దుర్మరణం చెందారు.ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలను ఎస్సై శ్రీనివాసరావు వివరించారు. విజయనగరానికి చెందిన  మురళీకృష్ణ వరప్రసాదరావు(51) గచ్చిబౌలి టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. దసరా పండుగకు విజయనగరం వెళ్లి వస్తుండగా  బొంగుళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌పై టైరు పేలి   కారు పల్టీ కొట్టి డ్రైవింగ్‌ చేస్తున్న వరప్రసాదరావు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి లక్ష్మణరావు, భార్య నీలవేణి, కుమారుడు నెహంత్‌కు స్వల్పగాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని