logo

24 గంటలూ.. ట్యాంకర్లతో నీటి సరఫరా

వచ్చేనెల మొదటి వారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా 24 గంటలపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ తెలిపారు. ఇందుకు అదనంగా 250 ట్యాంకర్లు, 24 ఫిల్లింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.

Published : 29 Mar 2024 03:44 IST

సమీక్షిస్తున్న పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, ఎండీ సుదర్శన్‌రెడ్డి, ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చేనెల మొదటి వారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా 24 గంటలపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ తెలిపారు. ఇందుకు అదనంగా 250 ట్యాంకర్లు, 24 ఫిల్లింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డితో కలిసి గురువారం ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. గతేడాదితో పోల్చితే ఈసారి 50శాతం అదనంగా ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగిందన్నారు. ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో వాణిజ్య అవసరాలకు ట్యాంకర్లతో నీటిని అందిస్తామన్నారు. గ్రేటర్‌ పరిధిలో 6, ఓఆర్‌ఆర్‌ ప్రాంతాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున 14 ఫిల్లింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ట్యాంకర్‌ బుక్‌ చేసిన 24గంటల్లో సరఫరా చేయాలని, ఆలస్యమైతే ఎస్‌ఎంఎస్‌ ద్వారా వినియోగదారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈడీ డాక్టర్‌ సత్యనారాయణ, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని