logo

Vikarabad: ఐరాసలో బషీరాబాద్‌ యువకుడి ప్రసంగం

స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో మార్చి 11 నుంచి 23 వరకు జరిగిన 55వ ఐక్యరాజ్యసమితి మానవ హక్కులు సమావేశంలో వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం బద్లాపూర్‌కు చెందిన సాయి సంపత్‌ పాల్గొన్నారు.

Updated : 30 Mar 2024 08:26 IST

జెనీవాలో మాట్లాడుతున్న సాయిసంపత్‌

బషీరాబాద్‌: స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో మార్చి 11 నుంచి 23 వరకు జరిగిన 55వ ఐక్యరాజ్యసమితి మానవ హక్కులు సమావేశంలో వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం బద్లాపూర్‌కు చెందిన సాయి సంపత్‌ పాల్గొన్నారు. ఎంఏ పూర్తి చేసిన ఆయన ఓ స్వచ్ఛంద సంస్థలో ప్రతినిధిగా కొనసాగుతున్నారు. సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన ఆయన శుక్రవారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. రెండు వారాలపాటు  ‘వాతావరణ మార్పు- ఆహార భద్రతపై ప్రభావం’  అనే అంశంపై ప్రసంగించానని చెప్పారు. విదేశీ కలుపు మొక్కల నియంత్రణపై ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన అంశాలపై సూచనలు అందించామన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రసాయనిక  మందులను ఉపయోగించడంతో నేల, నీరు, వాతావరణం కలుషితమవుతోందని వివరించినట్లు తెలిపారు. సహజ పద్ధతిలో కలుపు తొలగించేందుకు, ఉపాధి హామీ పథకానికి జోడించాలని, ఎనిమిదేళ్ల పాటు ఈ విధానాన్ని అనుసరిస్తే విదేశీ కలుపు అంతరిస్తుందన్నారు. ఈ అంశంతో పాటు విద్య, రోడ్లు, రాజకీయాల అంశాలపై మాట్లాడానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని