logo

నగరం నుంచి అరుణాచలం యాత్ర

నగరం నుంచి అరుణాచలం వెళ్లే భక్తులు పెరుగుతున్నారు. ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ బస్సులు నడుపుతుంటే.. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా ప్రత్యేక యాత్రలను సిద్ధం చేసింది.

Published : 10 Apr 2024 01:41 IST

పౌర్ణమి రోజుల్లో టీఎస్‌టీడీసీ ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: నగరం నుంచి అరుణాచలం వెళ్లే భక్తులు పెరుగుతున్నారు. ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ బస్సులు నడుపుతుంటే.. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా ప్రత్యేక యాత్రలను సిద్ధం చేసింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే వారు ముందుగా టిక్కెట్‌ రిజర్వు చేసుకోవాలని టీఎస్‌టీడీసీ విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్‌ 23, మే 22, జూన్‌ 21 తేదీల్లో పౌర్ణమి వస్తున్న సందర్భంగా ఏప్రిల్‌ 21, మే 20, జూన్‌ 19 తేదీల్లో ఈ యాత్రలు నగరం నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. మొదటి రోజు సాయంత్రం 6.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని టీఎస్‌టీడీసీ కార్యాలయం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. రెండోరోజు ఉదయం 6 గంటలకు నేరుగా కాణిపాకం చేరుకుంటారు. అనంతరం నేరుగా తిరువన్నామలై మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటలకు అరుణచలేశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. మూడోరోజు శ్రీపురంలో ఉన్న స్వర్ణ ఆలయాన్ని సందర్శించుకుంటారు. నాలుగో రోజు ఉదయం 4 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. పూర్తి వివరాలకు www.tstdc.in వెబ్‌సైట్‌లో చూడాలని, టిక్కెట్లు బుక్‌ చేయాలనుకునేవారు 9848540371 ఈ నంబరుకు ఫోను చేయాలని టీఎస్‌టీడీసీ పేర్కొంది. రవాణా, వసతి మాత్రమే కల్పిస్తుంది. దర్శనం, భోజనాలు ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకు పెద్దలకు రూ.7500లు, చిన్నారులకు రూ. 6 వేలు చెల్లించాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని