logo

నిఘా పెట్టి.. ఆచూకీ కనిపెట్టి

నలుగురు యువకులు ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జీడిమెట్ల నేరవిభాగం ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌నాయక్‌ ప్రత్యేక నిఘా పెట్టి వారిని కటకటాల్లోకి పంపించారు.

Published : 17 Apr 2024 02:23 IST

చోరీలకు పాల్పడుతున్న నలుగురి రిమాండ్‌

జీడిమెట్ల, న్యూస్‌టుడే: నలుగురు యువకులు ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జీడిమెట్ల నేరవిభాగం ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌నాయక్‌ ప్రత్యేక నిఘా పెట్టి వారిని కటకటాల్లోకి పంపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌కు చెందిన షేక్‌ దస్తగిరిబాబా(32) రాత్రి వేళ ఇళ్లలోకి ప్రవేశించి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు దొంగిలిస్తున్నాడు. అతడినుంచి ల్యాప్‌టాప్‌, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్టకు చెందిన శివకుమార్‌(34) రోడ్డుపక్కన పార్కింగ్‌ చేసిన వాహనాలను తస్కరిస్తున్నాడు. అతనిపై 30 దొంగతనం కేసులున్నాయి. రామ్‌రెడ్డినగర్‌కు చెందిన పొన్న సాయిలు(34) పల్సర్‌ వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. ఆ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగడ్డకు చెందిన హర్షద్‌(21) పాన్‌ డబ్బాల్లో చోరీలు చేయడంతోపాటు ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్నాడు. అతనిపై సనత్‌నగర్‌ ఠాణాలో రెండు, జీడిమెట్ల ఠాణాలో రెండు కేసులున్నాయి. అతని నుంచి ద్విచక్ర వాహనం, చరవాణి, రూ.11 వేలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని