logo

నేతల గ్రామం అంతర్గాం

జగిత్యాల మండలం అంతర్గాం గ్రామం ప్రత్యేకత సంతరించుకుంది. గ్రామానికి చెందిన అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారు.

Updated : 18 Nov 2023 06:07 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల మండలం అంతర్గాం గ్రామం ప్రత్యేకత సంతరించుకుంది. గ్రామానికి చెందిన అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారు. మాకునూరి ధర్మారావు 1962లో జగిత్యాల నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే ఎన్నికయ్యే సమయానికి ఆయన గుత్తేదారుగా ఉండడంతో ఏడాదికే అనర్హత వేటుపడింది. 1967లో మాకునూరి శ్రీరంగారావు కాంగ్రెస్‌ పార్టీ తరఫున కరీంనగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1985లో గొడిసెల రాజేశంగౌడ్‌ శాసనసభకు ఎన్నికై ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ఐదేళ్లపాటు రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం వేములవాడ నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా ఐదేళ్లపాటు ఉన్నారు. సుద్దాల దేవయ్య మొదట కరీంనగర్‌ జడ్పీ ఛైర్మన్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం రెండుసార్లు నేరెళ్ల, చొప్పదండి నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్ర సహకార మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ 2018లో శాసనసభకు ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని