logo

సంకల్పించారు.. అడవిని సృష్టించారు!

ఇప్పుడు నాటే మొక్క భవిష్యత్తులో మహావృక్షంగా ఎదుగుతుందని, కాసింత శ్రద్ధ కనబరిస్తే అటవీ సంపదను సృష్టించవచ్చునని నిరూపిస్తున్నారు కొందరు అటవీ అధికారులు..

Published : 10 Apr 2024 01:58 IST

100 ఎకరాల పోడుభూమిలో ఏర్పాటైన అడవి

ఇప్పుడు నాటే మొక్క భవిష్యత్తులో మహావృక్షంగా ఎదుగుతుందని, కాసింత శ్రద్ధ కనబరిస్తే అటవీ సంపదను సృష్టించవచ్చునని నిరూపిస్తున్నారు కొందరు అటవీ అధికారులు.. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం అటవీ క్షేత్రాధికారిగా 2019లో విధుల్లో చేరిన కోటేశ్వరరావు అడవుల సంరక్షణకు కంకణం కట్టుకున్నారు. ఎల్చిరెడ్డిపల్లి రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలోని సుమారు 100 ఎకరాల అటవీ భూమిని గుర్తించిన ఆయన పోడుసాగుదారుల నుంచి ఎటువంటి వివాదాలకు తావులేకుండా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 48 వేల అడవి జాతి మొక్కలు నాటారు. తదుపరి జరిగిన బదిలీల్లో కొత్తగూడెం వెళ్లారు. అనంతరం విధుల్లో చేరిన రేంజర్‌ తేజస్విని మొక్కల సంరక్షణ  బాధ్యతలు చేపట్టి అడవి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కోటేశ్వరరావు సంకల్పానికి జీవం పోశారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ ప్రాంతం చిన్నపాటి అడవిని తలపిస్తోంది. అడవుల వృద్ధితో ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ ఆ ఇద్దరు అధికారులు చేసిన ప్రయోగం ఆదర్శంగా నిలుస్తోంది.

పినపాక, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని