logo

ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం: మంత్రి

నడిగడ్డలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసుకుందామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శాంతినగర్‌లో మంగళవారం జరిగిన పార్టీ నాయకులు సమావేశానికి హాజరై మాట్లాడారు.

Published : 17 Apr 2024 05:25 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి

శాంతినగర్‌, న్యూస్‌టుడే: నడిగడ్డలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసుకుందామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శాంతినగర్‌లో మంగళవారం జరిగిన పార్టీ నాయకులు సమావేశానికి హాజరై మాట్లాడారు. పది సంవత్సరాల భారాస పాలనతో జిల్లాలో ప్రాజెక్ట్‌లపై శ్రద్ధపెట్టి ఉంటే ఈ రోజు రైతులు సాగునీటికి అవస్థలు పడాల్సి వచ్చేదికాదన్నారు. గట్టుఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కింద రిజర్వాయర్ల ఏర్పాటు పూర్తి చేసి ఉంటే 80 వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బందితీరేదన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని భారాస నిరుపేదలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. కృష్ణా జలాల విషయంలో భారాస ప్రభుత్వం రాష్ట్ర హక్కులను పోగొట్టిందన్నారు. భాజపా రాముడిని రాజకీయానికి వాడుకుంటునారన్నారని, మతాన్ని రెచ్చగొట్టి అక్షింతలు ఇస్తే ఉద్యోగాలు, నీళ్లు వస్తాయా అని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే మల్లు రవిని గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు.

పూర్తికి కృషి: జిల్లా ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పూర్తికి కృషిచేస్తానని నాగర్‌కర్నూల్‌ లోకసభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. కేంద్రంలో రాహుల్‌గాందీ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనతో అభివృద్ధిలో దూసుకుపోదామని పిలుపునిచ్చారు. మల్లు రవి విజయానికి అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సరిత, నారాయణరెడ్డి, గట్టుతిమ్మప్ప, సీతారామిరెడ్డి, శంకర్‌, షేక్షావలిఆచారి, రవి, జగన్‌, రామకృష్ణారెడ్డి, జయన్న, నాగరాజు, నాగశిరోమణి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని