logo

‘మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌’

లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్రంలో మూడు ఎస్పీ రిజర్వుడు లోకసభ స్థానాల్లో ఒక్కటీ తమకు కేటాయించలేదని ఎమ్మార్పీస్‌ నాయకులు ధ్వజమెత్తారు.

Published : 18 Apr 2024 04:03 IST

అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్రంలో మూడు ఎస్పీ రిజర్వుడు లోకసభ స్థానాల్లో ఒక్కటీ తమకు కేటాయించలేదని ఎమ్మార్పీస్‌ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం అంబేద్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో మాలల కంటే జనాభా పరంగా ఎక్కువగా ఉన్న మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకుండా మూడు సీట్లను మాల సామాజికి వర్గానికి ఇవ్వడంపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని రెండు లోకసభ స్థానాలు మాదిగలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆంజనేయులు, భాస్కర్‌, ఎల్లప్ప, బుచ్చన్న, శంకర్‌, రంజిత్‌ కుమార్‌, మహేష్‌, నర్సింహులు, ఆనంద్‌, రత్నం, తిమ్మన్న తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు