logo

పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి, మన బస్తి-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు.

Published : 02 Feb 2023 05:08 IST

కతాల్‌గూడలో మనబస్తి- మన బడిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి,
పుర ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, అదనపు కలెక్టర్‌ ఖుష్భూ గుప్తా

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి, మన బస్తి-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండలో మన బస్తి-మన బడి కింద అన్ని వసతులతో తీర్చిదిద్దిన కతాల్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, పద్మనగర్‌లోని ఎంకేవీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ ఖుష్బూగుప్తాతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు సర్కారు రూ.7,289 కోట్లు నిధులు కేటాయించిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్యుయల్‌డెస్క్‌బెంచ్‌లు, గ్రీన్‌బోర్డులు, విద్యుత్‌, మూత్రశాలల, వంటగదులు, తాగునీటి ట్యాంకులు, భవనాల మరమ్మతులు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ .. జిల్లాలో మన ఊరు- బన బడి కింద మొదటి విడతలో 517 పాఠశాలను గుర్తించి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. డీఈఓ బి.భిక్షపతి మాట్లాడారు. పుర ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, కమిషనర్‌ రమణాచారి, ఎంపీపీలు కరీంపాష, విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి, చిట్లవెంకటేశం, ఎంఈవో నర్సింహా, అరుంధతి, రాము, హెచ్‌ఎం తరాల పరమేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి గ్రామీణం: సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్నారని.. జడ్పీఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. యల్లారెడ్డిగూడెం, నార్కట్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడిలో భాగంగా వివిధ రకాల పనులను బుధవారం అదనపు కలెక్టర్‌ కుష్బూ గుప్తాతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచారని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ యాదగిరి, సర్పంచి మేడి పుష్పలత, స్రవంతి, ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ మురళీమోహన్‌, పీఆర్‌ఏఈ మోహన్‌, ఎంపీటీసీ సభ్యురాలు పావని పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని