logo

సంక్షిప్త వార్తలు

జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు 8,799 మందికి గాను 8,225 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మొత్తం పూర్తయ్యాయి. బ్రిడ్జి కోర్సుకు సంబంధించిన రెండు పరీక్షలను 20, 21న నిర్వహిస్తున్నట్లు

Published : 20 May 2022 03:02 IST

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు 8,799 మందికి గాను 8,225 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మొత్తం పూర్తయ్యాయి. బ్రిడ్జి కోర్సుకు సంబంధించిన రెండు పరీక్షలను 20, 21న నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌ నోడల్‌ జిల్లా అధికారి సలాం వెల్లడించారు.


డీఆర్డీవోగా సాయన్న

కామారెడ్డి కలెక్టరేట్‌: కామారెడ్డి డీఆర్డీవోగా సాయన్నను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేసిన వెంకటమాధవరావు గత నెల 24 నుంచి సెలవుల్లో ఉన్నారు. ఆయన స్థానంలో కమిషనరేట్‌లో పని చేస్తున్న సాయన్నను పంపుతున్నారు. ఆర్నెల్ల క్రితం ఆయన ఇక్కడే ఏపీడీగా, ఇన్‌ఛార్జి డీపీవోగా పనిచేశారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


కోనాపూర్‌ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభం

బీబీపేట : కోనాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ రూ.2.50 కోట్ల సొంత ఖర్చుతో తలపెట్టిన ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, సర్పంచి చెప్యాల నర్సవ్వ చేతుల మీదుగా ముగ్గు పోసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, వైస్‌ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచి స్వామి, సొసైటీ డైరెక్టర్‌ దేవునిపల్లి శ్రీనివాస్‌, మాజీ సర్పంచి సాయాగౌ, రెక్రాస్‌ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్‌గౌ, కోఆప్షన్‌ సభ్యుడు ఆసీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.


నేడు వైద్యశాఖలో ప్రతిభా జాబితా ప్రదర్శన

కామారెడ్డి వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఎన్‌పీసీడీసీఎస్‌, ఎస్‌ఎన్‌సీయూ స్టాఫ్‌ నర్సుల ప్రతిభా జాబితాను ప్రదర్శించనున్నట్లు డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో తప్పులపై ఈ నెల 23లోగా అభ్యంతరాలు తెలపాలని సూచించారు.


ఆరోపణలు అవాస్తవం

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: శ్రీవారి వెంచర్‌పై భాజపా నేత వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తమవని సంస్థ డైరెక్టర్‌ గడ్డం సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగాపూర్‌, కృష్ణాజివాడి, అబ్దుల్‌నగర్‌ గ్రామాల రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి వెంచర్‌ చేశామన్నారు. అందులో అసైన్డ్‌భూమి లేదని పేర్కొన్నారు. బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. సమావేశంలో ప్రతినిధులు అరవింద్‌, శ్రీకాంత్‌,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని