logo

The Kashmir Files: ది కశ్మీర్‌ ఫైల్స్‌.. సినిమా థియేటర్‌లో ఉద్రిక్తత

ఆదిలాబాద్‌ పట్టణంలోని నటరాజ్‌ థియేటర్‌లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా ప్రదర్శన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు...

Updated : 19 Mar 2022 04:25 IST

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ పట్టణంలోని నటరాజ్‌ థియేటర్‌లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా ప్రదర్శన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు పాకిస్థాన్‌కు జై కొట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అనంతరం జైకొట్టిన వ్యక్తులపై ప్రేక్షకులు కొందరు దాడి చేయటంతో వారు పరారైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా మద్యం తాగిన మైకంలో మరో దేశానికి జైకొట్టిన అనంతరం పరారైనట్లుగా పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని