logo

చౌడువాడలో పులిపంజా

చౌడువాడ సమీపాన గల నల్లకొండ అటవీ ప్రాంతానికి దగ్గరలో గల పాకలో సోమవారం రాత్రి పులి దెబ్బకు ఎదిరి అప్పల నర్శమ్మకు చెందిన చూడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనతో చౌడువాడ, గరుగుబిల్లి, చింతపాలెం, ఆర్లి, చంద్రయ్యపేట గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. పెద్దపులిని బంధించేందుకు

Published : 10 Aug 2022 05:35 IST

దాడి సంఘటనను సబ్‌ డీఎఫ్‌ఓ ధర్మ రక్షిత్‌కు వివరిస్తున్న బాధితులు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: చౌడువాడ సమీపాన గల నల్లకొండ అటవీ ప్రాంతానికి దగ్గరలో గల పాకలో సోమవారం రాత్రి పులి దెబ్బకు ఎదిరి అప్పల నర్శమ్మకు చెందిన చూడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనతో చౌడువాడ, గరుగుబిల్లి, చింతపాలెం, ఆర్లి, చంద్రయ్యపేట గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. పెద్దపులిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని సబ్‌ డీఎఫ్‌ఓ ధర్మ రక్షిత్‌ తెలిపారు. ఆయన మంగళవారం చౌడువాడలో పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. తాము తెల్లవారుజామున ఆవుకు గడ్డి వేసేందుకు రాగా మృతి చెంది ఉందని వెంటనే గ్రామ పెద్దల ద్వారా సమాచారం అందించామని బాధిత కుటుంబ సభ్యులు సబ్‌ డీఎఫ్‌ఓ దృష్టికి తెచ్చారు. రాత్రికి సీసీ కెమెరాలను అమర్చాలని, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పులిని బంధించేందుకు బోనును ఏర్పాటు చేస్తామని, గ్రామస్థులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని