logo

ఐజీ హోదాలో బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించింది. దానిలో భాగంగా డీఐజీ హోదాలో పనిచేస్తున్న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషికి ఐజీగా పదోన్నతి కల్పించి ఇక్కడే సీపీగా

Published : 25 Jan 2022 01:41 IST

ఉత్తర్వుపై సంతకం చేస్తున్న సీపీ తరుణ్‌జోషి. చిత్రంలో పోలీస్‌ అధికారులు పుష్ప, వెంకటలక్ష్మి, సాయిచైతన్య, వైభవ్‌ గైక్వాడ్‌, పంకజ్‌

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించింది. దానిలో భాగంగా డీఐజీ హోదాలో పనిచేస్తున్న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషికి ఐజీగా పదోన్నతి కల్పించి ఇక్కడే సీపీగా పోస్టింగ్‌ ఇచ్చింది. సోమవారం ఐజీ హోదాలో సీపీగా ఆయన చేపట్టారు. ముందుగా సాయుధ పోలీసు గౌరవవందనం స్వీకరించి కమిషనరేట్‌లోకి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. సీపీని వెస్ట్‌జోన్‌ డీసీపీ సీతారాం, ఏఆర్‌ అదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్‌, ఏసీపీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోకిల సత్యనారాయణ సీపీకి పుష్పగుచ్ఛం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని