logo

సహాయ నిధికీ వక్రభాష్యం

వైకాపా నేతల ప్రచారయావ పరాకాష్ఠకు చేరి కొత్త పుంతలు తొక్కుతోంది. వీరవాసరం గ్రామానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కేవలం రూ.10 వేలు మంజూరవగా.. ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు ఆర్థికంగా ఆదుకున్నట్లు వీడియో రూపొందించి స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు.

Published : 16 Apr 2024 05:13 IST

స్థానిక ఎమ్మెల్యేనే ఇచ్చినట్లు ప్రచారం

వీరవాసరం, న్యూస్‌టుడే: వైకాపా నేతల ప్రచారయావ పరాకాష్ఠకు చేరి కొత్త పుంతలు తొక్కుతోంది. వీరవాసరం గ్రామానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కేవలం రూ.10 వేలు మంజూరవగా.. ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు ఆర్థికంగా ఆదుకున్నట్లు వీడియో రూపొందించి స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై లబ్ధిదారుడు దొడ్డి శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం తన భార్య ఉమ అనారోగ్యానికి గురవగా రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు తెలిపారు. దీనికి సుమారు రూ. 70 వేలు ఖర్చు కాగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.10 వేలు మంజూరైందన్నారు. ఇటీవల భీమవరం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం పొందినందుకు వీడియో చిత్రీకరిస్తానని చెప్పడంతో అంగీకరించినట్లు తెలిపారు. ఆ వీడియోలో తాము చెప్పిన వివరాలు ఎడిట్‌ చేసి తమకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆర్థిక సహాయం చేసినట్లు చూపుతూ వైకాపా వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.10 వేలు అందిన విషయం వాస్తవమే అయినా భీమవరం ఎమ్మెల్యేనే ఆర్థిక సాయం చేసినట్లు తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని