logo

బుడ్గ జంగాలకు ఎస్సీ ధ్రువీకరణ ఇప్పిస్తా : నిమ్మల

బేడ బుడ్గజంగాలకు గతంలో మాదిరిగానే ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించేలా కృషి చేస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు.

Published : 16 Apr 2024 05:25 IST

ఎమ్మెల్యేను సత్కరిస్తున్న బుడ్గజంగాల నాయకులు

పాలకొల్లు, న్యూస్‌టుడే: బేడ బుడ్గజంగాలకు గతంలో మాదిరిగానే ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించేలా కృషి చేస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో కలిసిన బుడ్గజంగాల నాయకులు వారి సమస్యలను విన్నవించారు. గతంలో అసెంబ్లీలో ఇదే విషయమై మాట్లాడారని ఈసారి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యను పరిష్కరించాలని తమకు సామాజిక భవనాన్ని నిర్మించాలని కోరారు. అధికారంలోకి రాగానే రూ.20లక్షలతో సామాజిక భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వగా నాయకులంతా కలిసి రామానాయుడిని సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు