logo

జన సమీకరణకు వైకాపా ప్రలోభాలు

నారాయణపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు వైకాపా నాయకులు జనసమీకరణ చేశారు. వచ్చినందుకు నగదు పంపిణీ చేశారు.

Updated : 16 Apr 2024 06:11 IST

నారాయణపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు వైకాపా నాయకులు జనసమీకరణ చేశారు. వచ్చినందుకు నగదు పంపిణీ చేశారు.

ఈనాడు, ఏలూరు, ఉండి, ఉంగుటూరు, గణపవరం, న్యూస్‌టుడే: రూ.500 నోటు..మద్యం సీసా..బిరియానీ పొట్లాం ఇచ్చి జనాన్ని తరలించేందుకు ‘మేమంతా సిద్ధం’ అంటూ వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. మంగళవారం భీమవరంలో జరగనున్న సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర, బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు వైకాపా నాయకులు సామభేదదానదండోపాయాలను ఉపయోగిస్తున్నారు. జగన్‌ సభలకు స్వచ్ఛందంగా జనాలు వచ్చే పరిస్థితి లేకపోవటంతో ఇలా ప్రలోభాల గాలం వేసి తరలిస్తున్నారు.

లెక్క పక్కా చేసుకుంటున్నారు.. సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జనసమీకరణ ప్రక్రియ మొదలైంది. వైకాపా ప్రైవేటు సైన్యమైన గృహసారథులు, కన్వీనర్లు.. సమావేశానికి ఎవరు వస్తున్నారో వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. సమావేశానికొస్తే బస్సెక్కగానే రూ.500, మద్యం సీసా ఇస్తాం, రెండు పూట్ల బిరియానీ ఇస్తామని చెబుతున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం జన సమీకరణలో ముమ్మరంగా తిరుగుతున్నారు. సభకు రావడానికి సందేహిస్తున్న వారిపై వాలంటీర్లను ప్రయోగించి..పథకాల పేరుతో భయపెట్టి ఒప్పిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా మీ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరింది.. మన నియోజకవర్గానికి మంగళవారం ముఖ్యమంత్రి బస్సు యాత్రగా తరలొస్తున్నారు. మీరంతా ఆయనకు స్వాగతం పలికేందుకు తరలిరావాలంటూ అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులకు సమాచారం చేరవేస్తున్నారు. ఉండి మండలం ఆరేడు, కోలమూరు, పాములపర్రు, ఉండి, ఎన్నార్పీఅగ్రహారం, యండగండి, ఉణుదుర్రు గ్రామాలకు వెళ్లే ప్రధాన కూడళ్లకు తరలిరావాలని వారికి చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వందల సంఖ్యలో మహిళలు కనిపించేలా ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉండి ప్రాంతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిపొందిన పలువురికి బస్సు యాత్రకు రావాలని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గణపవరం మండలంలోనూ ఇదే పరిస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు