‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
వరుస అంటువ్యాధులు వెంటాడుతోన్న వేళ.. డిసీజ్ ఎక్స్ (Disease X)వంటి కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బ్రిటన్ శాస్త్రవేత్తల ముందస్తు హెచ్చరిక
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాలను వరుస అంటువ్యాధులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ (Coronavirus), మంకీపాక్స్ (Monkeypox) వంటి వ్యాధులు ప్రబలంగా విస్తరిస్తోన్న వేళ.. రానున్న రోజుల్లో మరో మహమ్మారి ముప్పు పొంచివుందనే భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో మురికినీటి నమూనాల్లో ఇటీవల పోలియోవైరస్ (Poliovirus) గుర్తించడం మరింత కలవరపాటుకు గురిచేసింది. అయితే, పోలియోను ఎదుర్కొనే వ్యాక్సిన్ విస్తృతంగా పంపిణీ చేసినందున పోలియో వ్యాప్తించే ప్రమాదమేమీ లేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
బ్రిటన్ను వెంటాడుతోన్న అంటువ్యాధులు..
కరోనా వైరస్‌తో వణికిపోయిన బ్రిటన్‌లో ఇటీవల మంకీపాక్స్ వ్యాధి ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కేసులు నిర్ధారణ కాగా గుర్తించనివి మరిన్ని ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యాధికంటే ముందు క్రిమియన్-కాంగో జ్వరం (Congo Fever) కేసులు నమోదుకావడం బ్రిటన్ను కలవరపెట్టింది. ఇటీవలి కాలంలో లాస్సా ఫీవర్ (Lassa Fever), బర్డ్ ఫ్లూ (Bird Flu) వంటి కేసులు కూడా బ్రిటన్ను వణికించాయి. ఇలా వరుసగా అంటువ్యాధులు వెలుగు చూస్తుండడంపై స్పందించిన నిపుణులు.. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రబలే ప్రమాదముందని హెచ్చరించారు. ఇలా వరుస అంటువ్యాధులు వెంటాడుతోన్న వేళ.. డిసీజ్ ఎక్స్ (Disease X)వంటి కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు అక్కడి ప్రభుత్వానికి సూచించారు.
ఏమిటీ డిసీజ్ ఎక్స్..?
డిసీజ్ ఎక్స్‌లో X అంటే భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారికి కారణమయ్యే వ్యాధికారకాలను సూచిస్తుంది. దీనివల్ల ప్రపంచస్థాయిలో తీవ్రమైన అంటువ్యాధులు సంభవిస్తాయి. అది ఏరకమైన వ్యాధి అనే విషయం కచ్చితంగా తెలియనప్పటికీ వ్యాధి ప్రాబల్యం మాత్రం అధికంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల ప్రస్తావించింది. ‘డిసీజ్ ‘ఎక్స్’ అనేది ఊహించని, ప్రస్తుతానికి ఊహాజనితమైన, అంటువ్యాధి. అది ఒకవేళ సంభవిస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాధికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురకాల కరోనా వైరస్లు, ఇంకా గుర్తించబడని ‘డిసీజ్ ఎక్స్’తోపాటు ప్రాధాన్యత కలిగిన వ్యాధులను అంచనా వేసేందుకు పరిశోధక రోడ్మ్యాపులు, ప్రయోగ నమూనాలను అభివృద్ధి చేశాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (మార్చి నెలలో) వెల్లడించింది.
కరోనా కంటే వినాశకారీ..?
జంతువుల నుంచి మానవులకు సోకే (Zoonotic) ఎన్నో వ్యాధులు రానున్న రోజుల్లో విరుచుకుపడొచ్చని గతంలో ఎంతోమంది నిపుణులు స్పష్టంగా పేర్కొన్నారు. ‘21వ శతాబ్దం ఆరంభంలో అంటువ్యాధులు ఓ తుపానులా విరుచుకుపడ్డాయి. రానున్న రోజుల్లోనూ ఇవి మరింతగా వ్యాప్తిచెందే ఆస్కారం ఉందని సూచిస్తున్నాయి’ అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్కి చెందిన ఎపిడమాలజీ నిపుణులు ప్రొఫెసర్ మార్క్ వూల్హౌజ్ పేర్కొన్నారు.
మనం సరికొత్త రోగకారక జీవుల యుగంలో జీవిస్తున్నామని.. డిసీజ్ ఎక్స్ కూడా అందులోని భాగమేనంటూ 1976లో ఎబోలా (Ebola)ను కనుక్కోవడంలో కీలకపాత్ర పోషించిన ప్రాఫెసర్ జీన్‌జాక్యూస్ ముయేంబే టామ్‌ఫమ్ గతేడాదే హెచ్చరించారు. ఇటువంటి పరిణామాలు మానవాళికి ముప్పు కలిగించేవేనని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ కంటే వినాశకరమైన కొత్త వ్యాధులు ఉద్భవిస్తాయా అనే ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. అటువంటివి కచ్చితంగా వస్తాయనే తాను భావిస్తున్నానని చెప్పారు. ఏదేమైనా భవిష్యత్తులో ఉద్భవించే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్‌కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్‌లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్‌లాండ్‌లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్‌కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్‌పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్‌లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్‌కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్‌పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్‌కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్‌లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్‌హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్
-
Rat hole Miners: ‘మమల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’