ట్రయల్స్ నిలిపివేత దురదృష్టకరమే.. కానీ..!

క్లినికల్ ట్రయల్స్‌ భాగంగా ఒక వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Updated : 10 Sep 2020 15:22 IST

వాషింగ్టన్: క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఒక వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై యూఎస్‌ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ స్పందించారు. ఇలా ట్రయల్స్‌ నిలిపివేడయం దురదృష్టకరమైన పరిణామమే అయినా, అసాధారణ విషయమేమీ కాదన్నారు. పని దగ్గర ఇదొక సేఫ్టీ వాల్వ్‌ లాంటిదని చెప్పారు.

ఈ సందర్భంగా ఫౌచీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..‘ఇలా క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించేప్పుడు, పనిదగ్గర ఇలాంటివి సేఫ్టీ వాల్వ్‌లా పని చేస్తాయి. ఏదేమైనా ఇలా జరగడం దురదృష్టకరం. తిరిగి వాళ్ల ట్రయల్స్‌ కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. కానీ, దీనిపై మరింత దర్యాప్తు జరగాల్సిన అసవరం ఉంది’ అని అన్నారు. 

ఇదిలా ఉండగా..వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణ విషయమేనని ఆస్ట్రాజెనికా అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విధంగా జరిగినప్పుడు మరోసారి లోతైన సమీక్ష నిర్వహించి..తిరిగి ప్రయోగాల్ని కొనసాగిస్తుంటామన్నారు. ఇంత భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించినప్పుడు ఒకరిద్దరిలో దుష్ప్రభావాలు తలెత్తడం సాధారణంగా జరుగుతుందని వెల్లడించారు. అయితే సదరు వాలంటీరుకు తలెత్తిన సమస్య వ్యాక్సిన్‌ వల్ల కలిగిన దుష్ప్రభావామా లేక యాదృచ్చికమా అనే విషయం తేలాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని