
టీకా ఇచ్చానుగా.. క్రిస్మస్ తాత సేఫ్!
అమెరికన్ అంటువ్యాదుల నిపుణులు ఫౌచీ
వాషింగ్టన్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చిన్నారులకు బహుమతులను అందించే క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ సురక్షితంగా ఉన్నారని.. తాను ఆయనకు కరోనా టీకా ఇచ్చానని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. రానున్న క్రిస్మస్ సందర్భంగా ఓ ఆంగ్ల టెలివిజన్ సంస్థ నిర్వహించిన ఓ ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు చిన్నారులు డిసెంబర్ 25కి శాంటాక్లాజ్ క్షేమంగా తమ ఇళ్లకు రాగలడా అని ప్రశ్నించారు. ఇందుకు జవాబుగా ఆయన సరదాగా స్పందించారు.
‘‘నేను అంత దూరాన ఉన్న ఉత్తర ధ్రువానికి వెళ్లాను. అక్కడ ఉన్న శాంటాక్లాజ్కు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాను. అనంతరం ఆయనకు రోగనిరోధకతను పరీక్షించాను. అది చక్కగా ఉంది. శాంటా వెళ్లేందుకు అంతా అనుకూలంగా ఉంది. మీరందరూ నిరుత్సాహపడతారనే విషయం నన్ను బాధించింది. అందుకే నేను ఈ జాగ్రత్త తీసుకున్నాను’’ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా క్రిస్మస్ తాత ఎప్పటి మాదిరిగానే చిమ్నీ గుండా వచ్చి బహుమతులు ఇస్తాడని.. ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదని అత్యున్నత వైద్య నిపుణులు ఆంటోనీ ఫౌచీ చిన్నారులను ఉత్సాహ పర్చారు.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.