Anand Mahindra: ‘ఎంత మంచి ఆలోచన’ మహీంద్రా పోస్ట్..

Anand Mahindra: సమాజంలో జరిగే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, స్ఫూర్తివంతమైన కథనాల్ని వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు.

Published : 08 Jan 2024 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో రోజూ పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోలు హల్‌చల్‌ చేస్తుంటాయి. వాటిలో కొన్ని ఆకర్షిస్తే, మరికొన్ని ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) పోస్ట్‌ చేశారు. అందులో పిల్లలకు పరిశుభ్రతను అలవర్చుకోవటం నేర్పించే తీరుపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహీంద్రా పంచుకున్న ఈ వీడియో అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

9 గంటలు.. 140 భాషల్లో పాటపాడి గిన్నిస్‌ రికార్డు

చిన్నారులకు పరిశుభ్రత అలవాటు చేసేందుకు ఓ టీచర్‌ వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థుల కంటే ముందుగా తరగతి గదికి వెళ్లి, ఆడుకొనే వస్తువులు, బొమ్మల్ని చిందరవందర చేస్తుంది. ఆ తర్వాత పిల్లల్ని క్లాస్‌లోకి అనుమతి ఇస్తుంది. గదిలోకి వచ్చిన పిల్లలు వెంటనే చెల్లాచెదురుగా ఉన్న వస్తువుల్ని సరిచేసి గదంతా శుభ్రం చేస్తారు. ఈ ఆలోచన రేకెత్తించే వీడియోను మహీంద్రా తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ఎంత మంచి ఆలోచన. అందరి సహకారంతో గదిని చక్కబెట్టారు. ప్రీ, ఎలిమెంటరీ పాఠశాల్లో ఇటువంటి విధానాన్ని మనం భాగం చేయగలమా?’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని