CBI: ₹20లక్షల లంచం.. ఎన్‌హెచ్‌ఏఐ జీఎం అరవింద్‌ కాలే అరెస్టు

లంచం తీసుకున్న కేసులో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జీఎం అరవింద్‌ కాలేను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Published : 03 Mar 2024 15:36 IST

దిల్లీ: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) జనరల్‌ మేనేజర్‌ అరవింద్‌ కాలేను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ₹20 లక్షల లంచం తీసుకున్న కేసులో అతడిని కస్టడీకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న అరవింద్ కాలే ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.  ఈ వ్యవహారంలో అరెస్టు చేసిన అనంతరం జరిపిన సోదాల్లో లంచంగా తీసుకున్న రూ.20లక్షలతో పాటు మొత్తం రూ.45లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కాలేతో పాటు సదరు ప్రైవేటు కంపెనీ, మరో 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు