Hassanpora: కశ్మీర్‌లో కాల్పులు.. పోలీసును బలిగొన్న ఉగ్రవాదులు

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. శనివారం ఇక్కడి అనంత్‌నాగ్‌ జిల్లాలోని హసన్‌పోరాలో వారు జరిపిన కాల్పుల్లో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ అమరుడయ్యాడు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘విధి నిర్వహణలో ఉన్న కుల్గాం పోలీస్‌స్టేషన్‌...

Published : 29 Jan 2022 23:55 IST

శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. శనివారం ఇక్కడి అనంత్‌నాగ్‌ జిల్లాలోని హసన్‌పోరాలో వారు జరిపిన కాల్పుల్లో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ అమరుడయ్యాడు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘విధి నిర్వహణలో ఉన్న కుల్గాం పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అలీ ముహమ్మద్‌ గనీపై సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు’ అని వెల్లడించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిపారు. మూడు వారాల క్రితం కూడా ఇదే ప్రాంతంలో భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు.

మరో ఘటనలో శ్రీనగర్‌లో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఇక్కడి మహరాజ్‌ బజార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు.. సీఆర్పీఎఫ్‌, పోలీసు సిబ్బందిపై గ్రెనేడ్‌ విసిరారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా భద్రతాబలగాలు కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో వారం క్రితం వరకు దాదాపు పదికి పైగా ఎన్‌కౌంటర్‌లలో 17 మంది ముష్కరులను హతమార్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని