Amit Shah: దేశాభివృద్ధి కోసం యువత అంకితమవ్వాలి: అమిత్‌ షా

ప్రధాని మోదీ (PM Modi) విజ్ఞప్తి మేరకు ఆగస్టు 15 నాడు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగరవేయాలని అమిత్‌ షా కోరారు. అలాగే, రాబోయే 25 ఏళ్ల పాటు యువత దేశాభివృద్ధికి అంకితం కావాలని పిలుపునిచ్చారు.

Updated : 13 Aug 2023 14:20 IST

అహ్మదాబాద్‌: భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు రాబోయే 25 ఏళ్లలో యువత దేశాభివృద్ధి కోసం అంకితం కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) పిలుపునిచ్చారు. గుజరాత్‌ (Gujarat) సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్‌ స్టేడియంలో తిరంగా యాత్రను ప్రారంభించారు. ప్రధాని మోదీ (PM Modi) విజ్ఞప్తి మేరకు ఆగస్టు 15నాడు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగరవేయాలని  షా కోరారు. ఆగస్టు 15, 2022 నుంచి ఆగస్టు 15, 2047 వరకు (25 ఏళ్ల పాటు ) దేశ ప్రజలంతా హర్‌ ఘర్‌ తిరంగాను నిర్వహించాలని సూచించారు. 

‘‘ఆజాదీ కా అమృత్‌ కాల్‌’ను దేశ ప్రజలు ఆగస్టు 15, 2047 వరకు నిర్వహించాలి. యువతకు అమృత్‌ కాల్ ఎంతో ముఖ్యమైన సమయం. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం అప్పట్లో దేశ స్వాతంత్ర్యం కోసం 90 ఏళ్లపాటు దేశ యువత పోరాడినట్లే.. ఇప్పటి యువత 2047 నాటికి భారత్‌ను గొప్ప దేశంగా నిలిపేందుకు తమను తాము దేశానికి అంకితం చేసుకోవాలి. 1857 నుంచి 1947 వరకు 90 ఏళ్ల పాటు చేసిన పోరాట ఫలితంగానే నేడు ప్రపంచంలోనే భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ముందుకు సాగుతోంది’’ అని అమిత్‌ షా తెలిపారు. 

సోషల్‌ మీడియా డీపీలు మారుద్దాం.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

కేంద్రం చేపట్టబోయే మేరీ మాటి మేరా దేశ్‌ కార్యక్రమం.. భారత్‌ స్వయం సమృద్ధి కలిగిన దేశంగా మారేందుకు తోడ్పడుతుందని అమిత్‌ షా అన్నారు. అలాగే, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం.. భారత్‌ దేశం సాధించిన అభివృద్ధిని, భావి తరాలకు దేశం గొప్పతనాన్ని తెలిసేలా చేస్తుందని చెప్పారు. దేశంలోని ప్రతి కుటుంబం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తే.. దేశం మొత్తం తిరంగామయం అవుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని