ఆయనకు భారతరత్న సరిపోదు: సుప్రీం కోర్టు

జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు ఉన్నతమైన వ్యక్తిగా కీర్తిస్తారని, సాధారణ పౌరులకు  ఇచ్చే అధికారిక గుర్తింపు పురస్కారాలు ఆయన అవసరంలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. గాంధీజీకి భారత అత్యున్నత...

Updated : 17 Jan 2020 18:16 IST

దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు ఉన్నతమైన వ్యక్తిగా కీర్తిస్తారని, సాధారణ పౌరులకు ఇచ్చే అధికారిక గుర్తింపు పురస్కారాలు ఆయనకు అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. గాంధీజీకి భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది.

‘‘గాంధీజీ భారతరత్న పురస్కారం కంటే ఎన్నో రెట్లు గొప్ప వ్యక్తి. ప్రజలు ఆయన్ను ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తారు. అలాంటప్పుడు ఆయనకు భారతరత్న ఎందుకు? అయితే, పిటిషనర్ మనోభావాలను మేం అర్థం చేసుకోగలం. దీనిపై ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించవచ్చు’’ అని సూచిస్తూ పిటిషన్ కొట్టివేస్తున్నట్లుగా ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా గాంధీజీని సత్కరించేందుకు భారతరత్న కంటే గొప్ప పురస్కారాన్ని సూచించాలని ధర్మాసనం పిటిషనర్‌ను కోరగా అది ఏంటనేది ప్రభుత్వం నిర్ణయించాలని పిటిషనర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని