భరణం తగ్గించుకోవడం కోసం ఉద్యోగం చేయాలని భార్యపై ఒత్తిడి చేయలేరు: దిల్లీ హైకోర్టు తీర్పు

విడాకులిచ్చిన భార్యకు చెల్లించే భరణాన్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగం చేయాలని ఆమెపై ఒత్తిడి చేయలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 26 Oct 2023 09:27 IST

దిల్లీ: విడాకులిచ్చిన భార్యకు చెల్లించే భరణాన్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగం చేయాలని ఆమెపై ఒత్తిడి చేయలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. డిగ్రీ చదువుకున్న ఆమె ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగం చేయడంలేదని ఆరోపించడం కూడా సరికాదని పేర్కొంది. తన భార్యకు నెలవారీగా చెల్లిస్తున్న రూ.25వేల భరణాన్ని రూ.15వేలకు తగ్గించాలని కోరుతూ ఆమె భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బీఎస్సీ చదువుకున్న ఆమె... అవకాశం ఉన్నప్పటికీ భరణం పొందడం కోసమే ఉద్యోగంలో చేరడంలేదని ఆరోపించారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌, జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణలతో కూడిన ధర్మాసనం... కుటుంబ న్యాయస్థానం నిర్ణయించిన మధ్యంతర భరణంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అలాగే భరణం మొత్తాన్ని పెంచాలన్న భార్య అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. అయితే, భరణం చెల్లింపులో జాప్యానికి గాను భర్తకు విధించిన రూ.వెయ్యి జరిమానాను ధర్మాసనం కొట్టివేసింది.బకాయిపడిన మొత్తానికి 6శాతం వడ్డీని జతచేసి భార్యకు అందజేయాలని భర్తను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని