భారత నౌకాదళం భేష్‌: అమెరికా రక్షణ మంత్రి ప్రశంస

హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్‌ నిర్వహించి..

Published : 19 Mar 2024 03:38 IST

దిల్లీ: హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్‌ నిర్వహించి.. సముద్రపు దొంగల చేతిలో చిక్కుకున్న ఒక వాణిజ్య నౌకను విడిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 17 మంది బందీలను విడిపించి, 35 మంది సాయుధ సముద్రపు దొంగలను నిర్బంధించింది. ఈ నేపథ్యంలో భారత నౌకాదళాన్ని ఆస్టిన్‌ ప్రశంసించారు.  ఈ మేరకు ఆయన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి డ్రోన్ల కొనుగోలు చేయాలన్న భారత ప్రణాళికలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని