Kumaraswamy: మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Published : 30 Aug 2023 16:10 IST

బెంగళూరు: కర్ణాటక (Karnata) మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ (JDS) సీనియర్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి బుధవారం తెల్లవారుజామున కాస్త ఆందోళనకరంగా మారింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

ఆయనను పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి అధికారులు తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ‘‘బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు కుమారస్వామి తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి వచ్చారు. వెంటనే పరీక్షించి చికిత్స మొదలుపెట్టాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’’ అని వైద్యులు తెలిపారు.

విపక్షాల కూటమి.. ‘పీఎం’ అభ్యర్థిగా ‘కేజ్రీవాల్‌’ ఉండాలి! ఆప్‌

ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఆసుపత్రికి ఫోన్‌ చేసి కుమారస్వామి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. గత వారం రోజులుగా వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామి బుధవారం కూడా కోలార్‌లో పర్యటించాల్సి ఉంది. అనారోగ్యం కారణంగా ఆ పర్యటనను జేడీఎస్‌ రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని