Auction: వేలంలో రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకంత ధర!

తమిళనాడులోని ఓ ఆలయంలో నిర్వహించిన వేలంపాటలో నిమ్మకాయ ధర ఏకంగా రూ.35 వేలు పలికింది.

Published : 11 Mar 2024 00:04 IST

ఈరోడ్‌: ఓ నిమ్మకాయ ఏకంగా రూ.35 వేలు పలికింది. తమిళనాడు (Tamil Nadu)లో నిర్వహించిన వేలం (Lemon Auction)లో ఈ ధర వచ్చింది. ఈరోడ్‌లోని శివగిరి గ్రామం సమీపంలోని ఓ ఆలయంలో ఇటీవల మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక పూజల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం నిమ్మ, ఇతర ఫలాలు, సామగ్రిని శివుడికి సమర్పించారు.

2025 చివరి కల్లా ‘సముద్రయాన్‌’!: కిరణ్‌ రిజిజు

అనంతరం ఆ సామగ్రిని వేలం వేశారు. ఇందులో మొత్తం 15 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈరోడ్‌కు చెందిన ఓ భక్తుడు రూ.35 వేలకు నిమ్మకాయను దక్కించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వందలాది భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం అతడికి అందజేసినట్లు వెల్లడించాయి. దీన్ని దక్కించుకున్నవారికి ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని