Punjab: సీనియర్ పోలీసును పెళ్లాడనున్న మంత్రి
పంజాబ్ (Punjab)లో మరో యువ మంత్రి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఓ లేడీ పోలీసును త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు.
చండీగఢ్: పంజాబ్ (Punjab) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్‌సింగ్ బేన్స్ (Harjot Singh Bains) వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అదే రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారిణి అయిన జ్యోతి యాదవ్ (Jyoti Yadav)ను ఆయన త్వరలోనే పెళ్లి (Marriage) చేసుకోనున్నారు. ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్థం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాన్‌ద్వాన్ వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
రూప్‌నగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన హర్జోత్.. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 32 ఏళ్ల బేన్స్.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) యువజన విభాగానికి నేతృత్వం వహించారు. అంతకుముందు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జ్యోతి యాదవ్ మాన్సా జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన జ్యోతి స్వస్థలం హరియాణాలోని గురుగ్రామ్. గతేడాది ఆప్ ఎమ్మెల్యే రాజింద్‌పాల్ కౌర్ చినా నియోజకవర్గంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టి వార్తల్లో నిలిచారు. తన అనుమతి లేకుండానే సోదాలు చేస్తున్నారని ఎమ్మెల్యే.. ఆమెపై ఆరోపణలు చేశారు.
గతేడాది పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో చాలా మంది నేతలు యువకులే. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే సీఎం భగవంత్ మాన్.. తన స్నేహితురాలు గుర్‌ప్రీత్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు నరీందర్ కౌర్ భరాజ్, నరీంద్‌పాల్ సింగ్ సవానా కూడా ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
-
Sports News
WPL: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి