రష్యా ప్రతిపక్ష నాయకుడి అరెస్టు!

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే బలగాలు ఆయన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.......

Updated : 21 Dec 2022 16:33 IST

ఖండించిన అమెరికా, ఈయూ

మాస్కో: రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే బలగాలు ఆయన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఐదు నెలల క్రితం నావెల్నీపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. జర్మనీలో చికిత్స తీసుకున్న అనంతరం తొలిసారి సొంత దేశానికి తిరిగి వెళ్లారు. నావెల్నీపై విష ప్రయోగం వెనుక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యను అప్పట్లో పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి.

అరెస్టుకు ముందు నావెల్నీ విమానాశ్రయంలో కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడారు. రష్యాకు తిరిగి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఏమాత్రం పశ్చాత్తాపం పడడం లేదన్నారు. గత ఐదు నెలల్లో తనకు ఇదే అత్యంత శుభదినమని వ్యాఖ్యానించారు. మరోవైపు నావెల్నీ అరెస్టుని వివిధ దేశాలు ఖండించాయి. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని అమెరికా, ఐరోపా సమాఖ్య డిమాండ్‌ చేశాయి.

నావెల్నీ రష్యాలో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేస్తామని గత వారమే అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఆయనపై మరో మూడు కేసులు కూడా ఉన్నాయి.

ఇవీ చదవండి...

రష్యా టీకా వినియోగానికి బ్రెజిల్‌ నిరాకరణ!

భారతీయ అమెరికన్లకు బైడెన్‌ పెద్దపీట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని